నాలుగు భాష‌ల్లో 'జెట్టి'.. టైటిల్ లోగో విడుదల

- May 18, 2021 , by Maagulf
నాలుగు భాష‌ల్లో \'జెట్టి\'.. టైటిల్ లోగో విడుదల

హైదరాబాద్: వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాతగా సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'జెట్టి'. సౌత్ ఇండియాలో తొలి హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా త‌న ప్రత్యేక‌త‌ను చాటుకుంది. ఈ మూవీ టైటిల్ లోగో లాంఛ్ చేసింది టీం. తెలుగు ,తమిళ్, మ‌ళ‌యాళం,క‌న్నడ భాష‌ల్లో టైటిల్ లోగోని విడుద‌ల చేసారు చిత్ర యూనిట్. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ, నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశంను తెరమీదకు తెస్తున్న చిత్రం జెట్టి నిలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com