తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- May 18, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది.తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది.ఇందులో 4,85,644 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 48,110 కేసులు యాక్టివ్ గాఉన్నాయి.ఇక రాష్ట్రంలో కరోనాతో 27 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,012 కి చేరింది. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 607 కరోనా కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com