12వ తరగతి ఎగ్జామ్స్ లో నో ఇన్స్ పెక్షన్

- May 19, 2021 , by Maagulf
12వ తరగతి ఎగ్జామ్స్ లో నో ఇన్స్ పెక్షన్

కువైట్: కోవిడ్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే 12వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇన్స్ పెక్షన్ విధానాల్లో మార్పులు చేసింది. పరీక్ష హాలులో విద్యార్ధులను వ్యక్తిగతంగా తనిఖీ చేసే విధానాన్ని ఈ ఏడాది రద్దు చేయాలని ఎడ్యూకేషన్ కమిటీ నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ మెయిన్టేన్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు పరీక్షా గదిలో విద్యార్ధుల మధ్య ఎడం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే..వ్యక్తిగత తనిఖీలు లేకున్నా పరీక్షల్లో చీటింగ్ కు పాల్పడే విద్యార్ధులను గుర్తించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. బ్లూటూత్, హెడ్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ లతో చీటింగ్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com