కేంద్ర ప్రభుత్వం పై ఏపీ హైకోర్టు అసహనం…
- May 19, 2021
అమరావతి: కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది.ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల ఆక్సిజన్ లో మహారాష్ట్ర కు 97 టన్నులు, ఏపీకి 3 టన్నుల సరఫరా చేసింది అని తెలిపింది ప్రభుత్వం.
అయితే ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది హైకోర్టు.అన్ని రాష్ట్రాలకు అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలె న్సింగ్ చేస్తామని కేంద్రం తెలిపింది. ఆసుపత్రుల్లో బిల్ చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ద్వారా చేయాలన్న హైకోర్టు… అవసరానికి సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దానికి మూడు నెలల సమయం పడుతున్న కేంద్రానికి… ఇది చాలా ఎక్కువ సమయమని, వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలనీ హైకోర్టు సూచించింది. కంప్రెషర్ల తయారీలో జాప్యం జరుగుతోందని, జూన్ మొదటి వారంలో 15 ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







