భారత్ కు అండగా ఉంటామంటున్న యూఏఈ
- May 19, 2021
యూఏఈ: భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఎటు చూసినా హృదయాన్ని కలచివేసే దృశ్యాలే!..ఇలా ఒక వైపు కరోనా తో పోరాడుతుంటే, తుఫాను 'తౌక్టే' రూపంలో ప్రకృతి కన్నెర్రచేసింది. ఇది దేశంలోని అనేక ప్రాంతాలను తాకి అపారమైన ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టాన్ని సృష్టించింది. ప్రజలు తుఫాను ఉగ్రరూపానికి వణికిపోయారు.
హింసాత్మక "తౌక్టే" తుఫాను బాధితులకు సంఘీభావాన్ని తెలియజేసింది యూఏఈ. భారత ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వటమే కాకుండా బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసింది యూఏఈ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ.
ఇదిలా ఉండగా, కరోనా సెకండ్ వేవ్ లో భారత్ కు ఆక్సిజన్ మరియు ఇతర వైద్య పరికరాలు అందించి, స్నేహభావాన్ని చాటుకుంది యూఏఈ.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు







