పిల్లలకు కరోనా సోకినా తీవ్ర లక్షణాలు ఉండవు - నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
- May 19, 2021
భారత్: చిన్నపిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలన్నారు. తాము ఇప్పుడు అదే పనిలో ఉన్నామని.. వైరస్‌లోని మార్పులను అర్థం చేసుకొని ఎలా స్పందించాలో అలా స్పందిస్తామని పేర్కొన్నారు. సింగపూర్ వైరస్ రకం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మూడో ఉద్ధృతి రూపంలో అది భారత్‌ను తాకొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
''పసి పిల్లలకు వైరస్ సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. వయసు పెరిగేకొద్దీ లక్షణాలు పెరుగుతూపోతాయి. వయసు తక్కువ ఉన్న వారికి ఇన్ఫెక్షన్ సోకినా.. అది ఉన్నట్లే తెలియదు. వయసు తగ్గేకొద్దీ లక్షణాలు తక్కువైపోతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే సరళి ఉంది. డిసెంబరులో 10 ఏళ్లలోపు వారిపై సర్వే చేసినప్పుడు పెద్దల్లో ఎంత మేర జీరో పాజిటివిటీ రేటు కనిపించిందో పిల్లల్లోనూ అంతే కనిపించింది. దీన్నిబట్టి పిల్లలకూ ఇది సోకుతోంది కానీ లక్షణాలు కనిపించడం లేదు. పిల్లలపై కొవాగ్జిన్ టీకా ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చాం. 10-15రోజుల్లో ఈ ప్రయోగాలు ప్రారంభమవుతాయి. మేం ఇంకా సింగపూర్ రకం వైరస్‌పై అధ్యయనం చేయలేదు. అధికారిక సమాచారం అందిన అనంతరం పరిశీలించి స్పందిస్తాం'' అని వీకే పాల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







