ఆయుర్వేద మందు అధ్యయనానికి సీఎం జగన్ ఆదేశం
- May 21, 2021
అమరావతి: ఏపీలో కోవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని అధికారులకు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు సిఎం జగన్. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని..ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్డెసివర్ బ్లాక్ మార్కెట్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిఎం జగన్. అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకోవా లన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు బుక్ చేసిన కేసులపై చర్యలుండాలని సిఎం జగన్ పేర్కొన్నారు. అలాగే నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు ఆయుర్వేదం మందుపై కేంద్రం ప్రభుత్వంలోని సంబంధిత విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని సీఎం జగన్ ఆదేశించారు.దీంతో నెల్లూరుకు వెళ్ళనుంది ఐసీఎమ్మార్ బృందం.అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఐసీఎమ్మార్ టీం.
తాజా వార్తలు
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..







