యూఏఈ: భారత్ కు ఆక్సిజన్ సాయం అందించిన ప్రవాసీయులు
- May 21, 2021
అబుధాబి: కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషి లో పాలు పంచుకోవడానికి ముందుకు వచ్చింది అబుధాబి లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్.ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గత 53 సంవత్సరాలు గా ప్రవాసీ భారతీయుల సంక్షేమానికి మూల బిందువుగా మరియు భారత దేశానికి అవసరం వచ్చినప్పుడల్లా తాము ఉన్నాము అంటూ అండగా నిలబడుతూ వచ్చింది.
ప్రస్తుతం భారత్ లో ఉన్న పరిస్థితు లలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత ఎదుర్కునే దిశ లో ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అబుధాబి, సుమారుగా రూ.10 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు (అల్యూమినియం సిలిండర్లు ),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఢిల్లీ వారికి పంపడం జరిగింది.భారత్ కరోనా ఎదుర్కునే క్రమంలో ఈ మధ్యనే ఎమిరేట్స్ విమానయాన సంస్థ భారత్ కి వెళ్లే అన్ని మెడికల్ ఎయిడ్ ఉచితంగా పంపబడుతుందని ప్రకటించింది. ఇండియా సోషల్ సెంటర్ వారు భారత దౌత్య కార్యాలయ అధికారులను సంప్రదించిన వెను వెంటనే వారు భారత్ కి అందిస్తున్న సహాయం లో భాగంగా ISC వారు అందిస్తున్న సహాయాన్ని చేర్చుకోవాల్సింది గా కోరారు.భారత దౌత్య కార్యాలయ కోరిన మేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ ISC భారత్ కు విరాళంగా ఇస్తున్న ఆక్సిజన్ సీలిండెర్స్ ను ఉచితంగా భారత్ కు రవాణా చేస్తున్నారు.నింపిన ఆక్సిజన్ సీలిండెర్స్ ని ఒక ప్రత్యేక ప్యాకింగ్ విధానం లో పంపాల్సి ఉంటుంది. ISC వారు దేశానికి అందిస్తున్న సహాయాన్ని దృష్టి లో పెట్టుకొని రజబ్ కార్గో వారు ఉచిత ప్యాకింగ్ అందించారు. ఆక్సిజన్ సీలిండెర్స్ ని ఎమిరేట్స్ సంస్థ వారికి అందించే కార్యక్రమం లో సంస్థ అధ్యక్షుడు (ACTING ) జార్జ్ వర్గీస్, జోజో జె.అమ్బుకెన్(ప్రధాన కార్యదర్శి),ఫ్రెడ్డీ జె. ఫెర్నాండెజ్(క్రీడా కార్యదర్శి),సి.జార్జ్ వర్గీస్(అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ), రాజా శ్రీనివాస రావు ఐతా(దక్షిణ భారత కార్యదర్శి) మరియు రాజు(జనరల్ మేనేజర్) పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ కి అన్ని విధాలుగా అండగా నిలిచిన అబుధాబి భారత దౌత్య కార్యాలయం వారికి సంస్థ యాజమాన్యం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఆక్సిజన్ సీలిండెర్స్ ని ఉచితంగా ప్యాకింగ్ చేసిన రజబ్ కార్గో వారికి మరియు ఉచిత రవాణా కి తోడ్పడిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ వారికి యూఏఈలో నివసిస్తున్న ప్రవాసీయుల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సంస్థ సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాస రావు తెలియజేశారు.ఇప్పుడు అందచేసిన సహాయం మొదటి భాగం మాత్రమే అని,ముందు ముందు మరింత సహాయం సంస్థ చేస్తుందని సంస్థ ప్రధాన కార్య దర్శి జోజో అంబూకేన్ తెలియజేశారు.

#IndiaNeedsOxygen #OxygenConcentrator #OxygenCrisis #Oxygen #COVIDEmergencyIndia #MaaGulf #UAE #AbuDhabi pic.twitter.com/mxqJQHyMfm
— Maa Gulf (@maagulf) May 21, 2021
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







