ఓ రకం ఫేస్ మాస్కుల పంపిణీని రద్దు చేసిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

- May 21, 2021 , by Maagulf
ఓ రకం ఫేస్ మాస్కుల పంపిణీని రద్దు చేసిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన తాజాగా జారీ చేసింది. ఓ రకం ఫేస్ మాస్క్ నిబంధనలకు అనుగుణంగా లేదనీ, దుమ్ముతో కూడినదై వుందనీ, సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్.ఎం 9988794 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఫేస్ మాస్కులను బ్యాన్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. తయారీదారు పేరు మాత్రం వెల్లడి కాలేదు. సాంకేతిక పరీక్ష అనతరం లోపాలు బయటపడ్డాయి. ఎవరూ ఈ మాస్కులను వినియోగించరాదనీ, వీటి గురించిన సమాచారం అందితే [email protected] కి ఫిర్యాదు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు ప్రజలకు సూచించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com