జూన్ 1 నుంచి బహిరంగ ప్రాంతాల్లో పగటి పనివేళలు బంద్
- May 25, 2021
కువైట్: జూన్ 1 నుంచి పగటి వేళలల్లో బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనులపై నిషేధం విధిస్తూ కువైట్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలపై నిషేధం అమలులో ఉండనుంది. వేసవి ఎండల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేందుకు ప్రతి యేడాది వేసవిలో నేరుగా ఎండతాకేలా బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనుల విషయంలో పని సమయాల్లో మార్పులు చేయటం సాధారణ విషయమే. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు నిబంధనలను అమలు చేయనుంది కువైట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ. అయితే..ఎవరైనా యజమానులు, నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!







