ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌పై త‌మిళుల ఆగ్ర‌హం..బ్యాన్ చేయాలంటూ డిమాండ్

- May 25, 2021 , by Maagulf
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌పై త‌మిళుల ఆగ్ర‌హం..బ్యాన్ చేయాలంటూ డిమాండ్

అక్కినేని కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రెండు నెల‌ల క్రిత‌మే ఈ వెబ్ సిరీస్ విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో తమిళ టైగర్స్ ని తప్పుడు విధానంలో చూపించారని దీని వ‌ల‌న తమిళులకు అవమానం ఎదురవుతోందని రచ్చ కొనసాగుతోంది.

తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 ను ప్రీమియర్లను నిషేధించాలని కోరుతూ తమిళ ప్రభుత్వం సమాచార ప్రసార శాఖ‌ మంత్రికి లేఖ రాసారు. శ్రీలంకలో ఈలం తమిళుల చారిత్రక పోరాటాన్ని వక్రీకరించారు. వారి దీర్ఘకాల ప్రజాస్వామ్య యుద్ధం త్యాగాలను తప్పుగా చూపించారని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అద్భుతమైన తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా ఈ సిరీస్ లో చాలా అవమానాలు.. అవరోధాలు ఉన్నాయని ఆరోపించింది. ఇందులో స‌మంత‌ను ఉగ్ర‌వాదిగా చూపించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా నివ‌సిస్తున్న త‌మిళుల‌పై నేరుగా దాడి చేయ‌డ‌మేన‌ని వారు లేఖ‌లో పేర్కొన్నారు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలను ఆపడానికి లేదా నిషేధించడానికి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం అభ్య‌ర్ధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com