కరోనాతో ఉద్యోగి మరణిస్తే... కుటుంబానికి జీతం.. !
- May 25, 2021
ముంబై: టాటా స్టీల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణించినట్లయితే వారి కుటుంబాలకి అండగా నిలబడతామని పేర్కొంది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. " టాటా స్టీల్.. ఒకవేళ మా సంస్థలో పనిచేసే ఉద్యోగి కరోనాతో మరణిస్తే... సదరు కుటుంబానికి ఆ ఉద్యోగి మరణించిన నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నారో అంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేస్తాం... ఇది ఆ ఉద్యోగికి 60 సంవత్సరాలు నిండేవరకు అందజేస్తాం. అంతేకాకుండా వైద్య, గృహపరమైన లబ్దిపొందేలా చూసుకుంటాం" అని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







