లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసు: టి.డీజీపీ
- May 25, 2021
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచే విధంగా జిల్లాకు రావడం జరిగింది అని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాస్ లు ఉన్న రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నాము. ఎలాంటి పని లేకుండా రోడ్లపై కి వస్తే కేసు నమోదు చేస్తాం, మళ్ళీ అదే విధంగా లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తాం అని తెలిపారు. రోడ్ల పైకి రాకుండా వంద శాతం లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలి. పోలిస్ అధికారులకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని సూచించడం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఫార్మా పరిశ్రమ అవసరాలను గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇతర పరిశ్రమల వారు లాక్ డౌన్ సడలించిన 4 గంటల్లో వారి పనులు చక్కబెట్టుకోవాలి అని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







