హైదరాబాద్ ఎయిర్ కార్గోకు 11,000 కు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
- May 26, 2021
హైదరాబాద్: కోవిడ్-19 దేశాన్ని కుదిపేస్తున్నప్పటి నుండి, ఆ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) ముందుంది. కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, పంపిణీ చేయడంలో GHAC నిరంతరం కృషి చేస్తోంది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుండి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల వంటి కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను తీసుకువెళ్ళే అనేక ఫ్రెయిటర్ విమానాలను GHAC హ్యాండిల్ చేసింది.

ప్రస్తుతం దేశానికి కోవిడ్ రోగుల చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం ఉన్న నేపథ్యంలో వాటిని వేగంగా, సమర్థంగా హైదరాబాద్‌కు తీసుకురావడానికి GHAC తన వనరులను సమకూర్చుకుంటోంది. కోవిడ్ వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం చాలా ఉంది. మే 1 నుండి ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి, భారతదేశంలోని ఇతర నగరాల నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి 11,500 యూనిట్లకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. ఇందుకోసం GHAC వివిధ విమానయాన సంస్థలు, కస్టమ్స్, ఫ్రైట్ ఫార్వార్డర్లు, గ్రౌండ్ హ్యాండ్లర్లతో కలిసి పని చేసింది. ఈ కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ భారతదేశానికి షెడ్యూల్డ్ విమానాలతో పాటు ప్రత్యేక చార్టర్లలో తరలి వచ్చాయి. కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ సరుకులను వేగంగా క్లియరెన్స్ చేయడానికి కస్టమ్స్ అధికారులు, విమానయాన సంస్థలు, సరుకు రవాణా ఫార్వార్డర్లు, ఇతర వాటాదారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

ఇటీవల, ఒక సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చిన సందర్భంలో వాటి రవాణాకు హైదరాబాద్ కార్గో దోహదపడింది. మంత్రి కె.టి.రామారావు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వాటిని అందుకున్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు, రష్యా నుండి రెండు స్పుత్నిక్ V వ్యాక్సిన్ల కన్సైన్‌మెంట్లను కూడా GHAC విజయవంతంగా హ్యాండిల్ చేసింది. మే 1న 1.5 లక్షల మోతాదుల వ్యాక్సిన్లు - ఇది దేశం యొక్క మొట్టమొదటి స్పుత్నిక్ వ్యాక్సిన్లు, మే 16 న 60,000 వ్యాక్సిన్లను హ్యాండిల్ చేసింది. దీనికి అవసరమయ్యే -20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ప్రత్యేక విధానాలు అవసరం.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ఒకే అతిపెద్ద కేంద్రంగా మారనుంది. రాబోయే 18-24 నెలల్లో ఇక్కడి నుంచి 3.6 బిలియన్ మోతాదుల వివిధ రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. జనవరి 2021 నుండి, హైదరాబాద్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసిన 100 టన్నులకు పైగా COVID వ్యాక్సిన్లు రవాణా అయ్యాయి.

హైదరాబాద్‌లో COVID వ్యాక్సిన్లు, కొవిడ్ రిలీఫ్ సామగ్రి పెరుగుతుందని ఊహించిన హైదరాబాద్ విమానాశ్రయం తన ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్ సౌకర్యాలను విస్తరిస్తోంది. వ్యాక్సిన్, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాలకు అవసరమైన ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఫార్మా జోన్‌ను దాదాపు రెట్టింపు చేస్తున్నారు, 15-25 డిగ్రీలు, 2-8 డిగ్రీలు మరియు -20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ జోన్లను విస్తరిస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం ఫార్మా సరుకులను అన్‌లోడ్ చేసేటప్పుడు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను నివారించడానికి విస్తరించిన ఫార్మా జోన్‌లో భాగంగా ‘కోల్డ్ సూపర్ స్టోర్’ను కూడా ప్రవేశపెడుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు







