SBI ఖాతాదారులకు షాక్.. !
- May 27, 2021
హైదరాబాద్: తన ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)జీరో బ్యాలెన్స్ ఖాతా కలిగినవారి నుంచి వచ్చే జులై 1వ తేదీ నుంచి కొత్త సర్వీసు రుసుములు వసూలు చేసేందుకు రెడీ అవుతోంది.క్యాస్ విత్‌డ్రాస్, చెక్‌బుక్‌పై పరిమితులు విధించింది.ఎస్బీఐ విధించిన తాజా పరిమితి దాటితే చార్జీలు వడ్డింపు తప్పదన్నమాట..ఇక, ఎస్బీఐ శాఖలో గానీ, ఏటీఎంలో గానీ మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా క్యాష్ విత్ డ్రాయల్‌కు అనుమతి ఉంటుంది.. పరిమితి దాటితే.. ప్రతి ఆపరేషన్‌పై రూ.15లతో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేయనుంది.ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసినా ఇదే తరహా ఛార్జీలు వడ్డించనున్నారు.మొత్తంగా.. ఎస్బీఐ కానీ, ఇతర ఏటీఎంలు గానీ.. నాలుగు సార్లు మాత్రమే ఉచిత సర్వీసు ఉంటుంది.
మరోవైపు..10 చెక్‌లతో కూడిన చెక్‌బుక్‌ను ఖాతాదారులకు ఉచితంగా అందిస్తోంది ఎస్బీఐ.. అంతకంటే,ఎక్కువ లీవ్స్ గల చెక్ బుక్ కావాలంటే అదనంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది.10 చెక్స్ కలిగిన బుక్ కు రూ.40లతోపాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75, అత్యవసరంగా చెక్ బుక్ కావాలంటే 10 చెక్స్ ఉన్న బుక్ కు రూ.50+జీఎస్టీ చెల్లించాలి.అయితే, తన ఖాతాదారులైన సీనియర్ సిటిజన్లకు మాత్రం చెక్ బుక్ ఛార్జీలు ఉండబోవు అంటోంది ఎస్బీఐ.మొత్తంగా..జులై 1వ తేదీ నుంచి ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త చెల్లింపులు మోత మోగించనున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







