జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్
- May 28, 2021
అజ్మన్: అజ్మన్ క్రౌన్ ప్రిన్స్ అలాగే అజమ్మన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నుయైమి ఆదేశాల మేరకు మునిసిపాలిటీ అండ్ ప్లానింగ్ డిపార్టుమెంట్ (అజ్మన్), కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకు జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. 2008, జనవరి 1 నుంచి 2021 మే 16 మధ్య కాలంలో జారీ చేయబడిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. డిపార్టుమెంట్ ఛైర్మన్ షేక్ రషీద్ బిన్ హుమైత్ అల్ నౌమి మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ప్రోత్సాహమిచ్చే వాతావరణాన్ని మరింత మెరుగు పరిచేందుకు కరోనా నేపథ్యంలో అన్ని అవకాశాల్నీ పరిశీలించి, మేలైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక వ్యాపారాలకు మద్దతునివ్వడం సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







