డిసెంబర్ నాటికి అందరికీ కోవిడ్ వ్యాక్సిన్: ప్రకాశ్ జావడేకర్
- May 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. మొత్తం 216కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. 108 కోట్ల మందికి టీకా ఇవ్వాలనే ప్రణాళిక పూర్తి అయిందని అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటు జైడస్, నొవావాక్, జినోవా, టీకాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన ఆయన విమర్శలు గుప్పించారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. కాగా అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకి గురిచేస్తోంది. ప్రస్తుతం దేశంలో 24.4 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







