సేలరీ రికార్డుల ఫోర్జరీ: ప్రైవేటు కంపెనీ సిబ్బంది పై విచారణ
- May 29, 2021
మనామా: ఓ ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి హై క్రిమినల్ కోర్టులో ఫోర్జరీ కేసుకి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నరు. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ (GOSI) సేలరీ రికార్డుల్ని ఫోర్జరీ చేశాడన్నది నిందితుడిపై మోబడ్డ అభియోగం. అనుమానాస్పదంగా వేతన పెంపు కనిపించడంపై జీఓఎస్ఐ అధికారులు విచారణ జరపగా ఈ ఫోర్జరీ బయటపడింది. మూడు సందర్భాల్లో నిందితుడు తన వేతన పెంపు కోసం ఫోర్జరీకి పాల్పడ్డాడు. 1950 నుంచి 3,300 బహ్రెయినీ దినార్స్ వరకు వేతనాన్ని పెంచుకున్నాడు నిందితుడు. తొలుత 2,100 బహ్రెయినీ దినార్స్ వరకు వేతనాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత 2,774 బహ్రెయినీ దినార్స్ పెంచుకున్నాడు. ఆ తర్వాత కంపెనీ, అతన్ని సస్పెండ్ చేసింది ఇతర కారణాలతో. అయితే, నిందితుడు ఆ తర్వాత కూడా తన వేతనాన్ని 3,300 బహ్రెయినీ దినార్లకు పెంచుకున్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకుగాను.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







