49 రెస్టారెంట్లు, కేఫ్, కేఫటేరియాలకు జరిమానా

- May 29, 2021 , by Maagulf
49 రెస్టారెంట్లు, కేఫ్, కేఫటేరియాలకు జరిమానా

దుబాయ్: కమర్షియల్ కంప్లియన్స్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) విభాగం - దుబాయ్ ఎకానమీ, నిర్దేశిత వేళల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 49 రెస్టారెంట్లు, కేఫ్స్ అలాగే కేఫటేరియాలకు జరిమానా విధించడం జరిగింది. రాత్రి 1 గంట తర్వాత కూడా వీటిల్లో వినియోగదారులకు అవకాశం కల్పిస్తుండడంతో చర్యలు తీసుకున్నారు అధికారులు. రాత్రి 1 గంట తర్వాత కేవలం డెలివరీ ఆర్డర్స్ కోసం మాత్రమే అనుమతులున్నాయి. అల్ కరామా, జుమైరా, సత్వా, అల్ మురాకాబత్ మరియు అల్ రిక్కా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. తనిఖీ బృందాలు, నాలుగు స్టోర్లపైనా (మిర్దిఫ్ సిటీ సెంటర్) జరిమానాలు జారీ చేయడం జరిగింది.ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని ఉల్లంఘనల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com