ప్రియురాలితో బ్రిటన్​ ప్రధాని​ రహస్య వివాహం!

- May 30, 2021 , by Maagulf
ప్రియురాలితో బ్రిటన్​ ప్రధాని​ రహస్య వివాహం!

లండన్​: బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​​ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రియురాలు క్యారీ సైమండ్స్​తో శనివారం బోరిస్​ రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. లండన్​లో వెస్ట్​మినిస్టర్​ క్యాథెడ్రల్​లో ఆయన వివాహం చేసుకున్నారని ది సన్​, మెయిల్​ ఆన్​ సండేవర్క్​ లాంటి టాబ్లాయిడ్​లు ప్రముఖంగా ప్రచురించాయి.

బోరిస్​-సైమండ్స్​ వివాహానికి సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. కేవలం కొద్దిమంది గెస్టుల మధ్య.. అది కూడా చివరి నిమిషంలో వాళ్లకు ఆహ్వానం ఇచ్చినట్లు ఆ పత్రికలు రాశాయి. ప్రస్తుతం కరోనా ఆంక్షలు కొనసాగుతుండడంతో 30 మందికి మాత్రమే వివాహ వేడుకలకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1గం.30ని సమయంలో వివాహం జరిగిందని, సైమండ్స్​ అరగంట ఆలస్యంగా వచ్చిందని ఆ కథనాలు వెల్లడించాయి. కాగా, బోరిస్ 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్​ స్ట్రీట్​లో తన గర్ల్​ఫ్రెండ్​ సైమండ్స్​(33)తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పోయినేడాది ఎంగేజ్​మెంట్ చేసుకున్న ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు.
 
అయితే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కొన్ని పత్రికలు కథనాలు రాసినప్పటికీ.. ఇప్పుడు హడావుడిగా పెళ్లి జరిగిందని అదే పత్రికలు మరోసారి కథనాలు రాశాయి. గతంలో బోరిస్(56)​ వివాహేతర సంబంధంతో కన్​జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కాగా, బోరిస్​ జాన్సన్​కి ఇది మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. చివరిసారిగా మరీనా వీలర్​ అనే లాయర్​కి 2018లో విడాకులిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com