రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
- May 30, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయని అన్నారు. వివిధ పథకాల కింద అర్హుల ఖాతాల్లో నేరుగా రూ.95,528 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. పరోక్షంగా ప్రజలకు మరో రూ. 36,197 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై 2 డాక్యుమెంట్లను రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రజలకు లబ్ధి చేకూర్చామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం అమలు చేశామని అన్నారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







