ఏపీ కరోనా అప్డేట్

- May 30, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,85,142 కు చేరింది. ఇందులో 15,08,515 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,65,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 94 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 10,832 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 21,133 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 84,232 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com