గత వారంలో 33,539 ట్రాఫిక్ ఉల్లంఘనలు

- May 30, 2021 , by Maagulf
గత వారంలో 33,539 ట్రాఫిక్ ఉల్లంఘనలు

కువైట్ సిటీ: గత వారం రోజుల్లో 33,539 మేర ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. మే 22 నుంచి 28 వరకు జరిగిన ఉల్లంఘనల వివరాలను వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిలో 53 మంది తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని..వారిని జైలుకు తరలించినట్లు వివరించారు. రూల్స్ బ్రేక్ చేసిన 16 మంది మైనర్లను జువైనల్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ కు తరలించినట్లు చెప్పారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వారిలో 244 వాహనాలను, మరో రెండు బైకులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com