ఇక నుంచి పూర్తిగా ఆన్ లైన్లోనే ఆర్టీఏ సర్వీసులు
- May 30, 2021
దుబాయ్: డిజిటలైజేషన్ లో భాగంగా ఆర్టీఏ సర్వీసులు అన్నింటిని ఆన్ లైన్ కి మారుస్తున్నట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. జూన్ 13 నుంచి వాహనాల లైసెన్సింగ్, ఫైన్ చెల్లింపులను ఆన్ లైన్ లోనే నిర్వహించుకోవచ్చు. ఆన్ లైన్ లో అందుబాటులో సర్వీసులు ఇకపై ఆర్టీఏ సర్వీస్ సెంటర్ల సేవల పరిధి నుంచి పూర్తిగా తొలిగించినట్లు కూడా ఆర్టీఏ స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా ఐదు రకాల వాహనాల లైసెన్సింగ్ సర్వీసింగ్..ఇన్సూరెన్స్ రీఫండ్, వెహికిల్ ఓనర్ షిప్, నాన్ ఓనర్ షిప్ ఆఫ్ వెహికిల్, వెహికిల్ క్లియరెన్స్, రిజిస్టర్ వాహనాల సర్టిఫికెట్ల వివరాలకు సంబంధించిన సేవలన్ని ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. జరిమానాల చెల్లింపులు పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ఆర్టీఏ సేవలను http://www.rta.ae వెబ్ సైట్ ద్వారాగానీ, దుబాయ్ డ్రైవ్ యాప్, కాల్ సెంటర్ 8009090 ద్వారా పొందవచ్చు. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రావటంతో ఇక నుంచి లెర్నింగ్ డ్రైవర్ ఫైల్ క్లియరెన్స్ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గనుంది. గతంలో లెర్నింగ్ డ్రైవర్ ఫైల్ కోసం రెండు రోజుల సమయం, నాలుగు సార్లు ఆర్టీఏ ఆఫీస్ విజిట్ చేయాల్సి వచ్చేది. ఇక నుంచి అసలు ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







