550 కోట్లతో మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు:మంత్రి పేర్ని
- May 30, 2021
అమరావతి: ఏపీ రాష్ట్ర రవాణా సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని ఆదివారం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం లో సోమవారం ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన శంకుస్థాపన చేసే కార్యక్రమం ఏర్పాట్లు అధికారులతో కలసి పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి వివిఐపిలు, వీఐపీలు, ప్రజా ప్రతినిధులు రానున్నారని, అందుకు అవసరమైన సంఖ్యలో డయాస్ పై సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు వాహనాల పార్కింగ్ ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు ఎండలు కారణంగా కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు. అతిథులకు స్నాక్స్ త్రాగునీరు టీ కాఫీ ఏర్పాటు చేయించాలని ఆవరణలో మామిడి తోరణాలతో అలంకరించాలి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారని అన్నారు. 75 ఎకరాల్లో 550 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు టెండర్లు పిలిచి రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కళాశాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఏడాదిలోగా కాలేజీ భవనాలు నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ ఉన్న 550 పడకల ఆసుపత్రి అటాచ్ చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుండి కాలేజీ మొదలు పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. స్థానిక దిమ్మల సెంటర్ నుండి కళాశాల వరకు నాలుగు లైన్ల రహదారి అభివృద్ధితోపాటు, ఫోర్ట్ రోడ్ కనెక్టివిటీ తో కళాశాల వరకు 60 అడుగుల రహదారి నిర్మించనున్నట్లు తెలిపారు రైల్వే లైన్ కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు.
బందరు పోర్టు నిర్మాణానికి జూన్ 6వ తేదీ టెండర్లు చివరి తేదీ కాగా జూన్లోనే టెండర్లు పూర్తి చేయాలని, మత్స్యకారుల ప్రధాన సమస్య సముద్ర మొగ మేట సమస్య పరిష్కారానికి 350 కోట్లతో టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో బందర్ ఆర్.డి.ఓ ఎన్.ఎస్.కె ఖాజావలి, డి.ఎస్.పి మాసుం భాష, తాసిల్దారు సునీల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







