ఒమన్: వలసదారులకు వర్క్ వీసా నిబంధనల మార్పు
- May 31, 2021
ఒమన్: విజిట్ వీసాపై ఒమన్ వచ్చే వలసదారులు, విజిటర్స్, తమ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్ల కింద మార్చుకోవచ్చని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఫ్యామిలీ జాయినింగ్ వీసాలు, స్టూడెంట్ వీసాలు ఇతర వీసాలకు సంబంధిత నిబంధనలకు లోబడి వుంటే, వాటికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది.వర్క్ వీసా లేదా టెంపరరీ వర్క్ వీసా కిందకి ఫారినర్స్ రెసిడెన్స్ చట్టానికి అనుగుణంగా ఆయా వీసాలను అథారిటీస్ మార్పు చేస్తాయి. జిసిసి దేశాలకు చెందిన నివాసితులకు జారీ చేయబడిన విజిట్ వీసా, సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు, సింగిల్ మరియు మల్టిపుల్ ఎంట్రీ బిజినెస్ వీసాలు, ఎక్స్‌ప్రెస్ వీసాలు, తక్షణ వీసాలు, స్టూడెంట్ వీసాలు, ఆన్ బోర్డు సెయిలర్లకు ఇచ్చే వీసాలు, క్రూయిజ్ షిప్పుల ద్వారా వచ్చే ప్రయాణీకులు, రెసిడెన్షియల్ యూనిట్స్ కలిగిన వారికి ఇచ్చే వీసాలు, వారి కుటుంబ సభ్యులకు లభించే వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఆయా వీసాల మార్పుకు సంబంధించి అవసరమైన ఫీజుల్ని చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!









