విశ్వ విఖ్యాత నట సార్వభౌమునికి జోహార్లు

- May 31, 2021 , by Maagulf
విశ్వ విఖ్యాత నట సార్వభౌమునికి జోహార్లు

టెక్సాస్/హ్యూస్టన్ : వంశీ  గ్లోబల్ అవార్డ్స్, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి,సంతోషం ఫిలిం న్యూస్ మరియు చంద్ర తేజాలయ మ్యూజిక్  అకాడమీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా.నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా అంతర్జాలంలో ఆ మహానటుడికి  జోహార్లర్పించారు.

అమెరికా గాన కోకిల తన వ్యాఖ్యానంతో, పాటలతో అద్భుతంగా నిర్వహించిన  ఈ కార్యక్రమం లో ప్రముఖ సినీ నటులు నిర్మాత మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ తాను NTR తో నటించానని తెలుగు వారి గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రిగా పేదలకు ఎన్నో సేవా పధకాలు ప్రవేశ పెట్టారని అలాంటి వ్యక్తికి భారత రత్న రాకపోవడం విచారకరం అని అన్నారు.

మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తాను NTR  అంటే తెలుగు , తెలుగంటే ఎన్టీఆర్ అని ఆయన తెలుగు జాతికి భాషకు చేసిన సేవలను గుర్తుచేశారు.దర్శక నిర్మాత ఎన్టీఆర్ వీరాభిమాని అయిన YVS చౌదరి NTR వంటి ప్రముఖుల చరిత్ర,  ఘనత, ప్రభావం  మీడియా ద్వారా టెక్నికల్ గా పొందుపరచాలని కోరారు.

సినీ గేయ రచయిత భువన చంద్ర,దర్శకులు రేలంగి నరసింహారావు, నటులు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్,రచయిత భారవి పాల్గొని వారి యొక్క అనుబంధాన్ని పంచుకున్నారు.ఐదు ఖండాల నుండి, పన్నెండు దేశాలు భారత దేశం, అమెరికా, UK , సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, Hong  Kong ,న్యూజిలాండ్, ఉగాండా, అబుదాబి, ఓమన్ ,సింగపూర్ ,మలేషియా దేశాల నుంచి పలువురు తెలుగు ప్రముఖులు వారి సందేశాలను పంపించి ఘన నివాళి అర్పించారు. ప్రముఖ అంతర్జాతీయ గాయకులూ పద్య గాన గందర్వ చంద్రతేజ మరియు శారద ఆకునూరి NTR సుమధుర గీతాలను ఆలపించారు.

వంశీ గ్లోబల్ అవార్డ్స్ వ్యవస్థాపకులు శిరోమణి డా.వంశీ రామరాజు NTR  కి వంశీ సంస్థకి  వున్న  అనుబంధాన్ని తెలియజేసారు.డా.తెన్నేటి సుధాదేవి అధ్యక్షురాలు-వంశీ, శైలజ సుంకరపల్లి మేనేజింగ్   ట్రస్టీ వంశీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com