ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- May 31, 2021
అమరావతి: ఆనందయ్య మందుకు మొత్తానికి ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అయితే, ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమతి నిరాకరించింది.ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం..ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది. ఇక, ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు అన్ని. ఆనందయ్య మందు వల్ల హాని లేదని తేల్చేశాయి.. కాగా, మొత్తం ఐదు రకాల మందులు తయారు చేస్తూ వచ్చారు ఆనందయ్య.. అందులో కంట్లో వేసే మందుకు మాత్రం ఇప్పుడు బ్రేక్ పడగా.. మిగతా నాలుగు మందులు తయారు చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు అయ్యింది.
అయితే, ఆనందయ్య మందుతో హానిలేదని నివేదికలు తేల్చినా.. ఆ మందు వాడితే కోవిడ్ తగ్గుతుందనడాకి నిర్ధారణ లేదని నివేదికలో పేర్కొన్నారు. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదిక రావడానికి మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ రోగులు రావొద్దు అని స్పష్టం చేసింది.కోవిడ్ రోగుల బంధువులు వచ్చి మందు తీసుకెళ్లాలని సూచించింది. ఇక, మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసేంది.ప్రస్తుతానికి అయితే.. ఆనందయ్య ఇచ్చే పీ.ఎల్.ఎఫ్ మందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







