కోవిడ్ నిబంధనల ఉల్లంఘన..356 మందిపై చ‌ర్య‌లు

- June 01, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన..356 మందిపై చ‌ర్య‌లు

దోహా: కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన  వారిని ఉపేక్షించేది లేద‌ని ఖ‌తార్ అధికారులు మ‌రోసారి హెచ్చ‌రించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కపోవ‌టం అంటే చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు ప‌ల్ప‌డుతున్న‌ట్లేన‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసిన ఖ‌తార్ అధికారులు...తాజాగా మ‌రో 356 మందిపై చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో 321 మంది ఫేస్ మాస్క్ ధ‌రించ‌లేద‌ని, మ‌రో 13 మంది భౌతిక దూరం పాటించ‌లేద‌ని వెల్ల‌డించారు. క్లోజ్డ్ ప్లేసులో గ్యాదర్ అయిన 19 మంది, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు, అలాగే ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని ఓ వ్యక్తిపై న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. 

 

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి  పునఃప్రారంభించనున్నారు. హైదరాబాద్‌(బేగంపేట్‌, అమీర్‌పేట్‌,టోలిచౌకి), నిజామాబాద్‌, కరీంనగర్‌తో పాటు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం, సచివాలయంలోని అటెస్టేషన్‌కేంద్రంలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి బాలయ్య తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com