భారత్ లో కరోనా కేసుల వివరాలు

- June 01, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది.దేశంలో కొత్త‌గా 1,27,510 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్ లో ఇప్ప‌టివ‌ర‌కు భారత్ లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,81,75,044 కి చేరింది.ఇందులో 2,59,47,629 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,95,520 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 2,795 మంది మృతిచెందారు.దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,31,895 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 2,55,287 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 21,60,46,638 మందికి వ్యాక్సిన్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com