మందుప్రియులకు శుభవార్త చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం

- June 01, 2021 , by Maagulf
మందుప్రియులకు శుభవార్త చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూ ఢిల్లీ: క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఢిల్లీలో అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, మందుప్రియులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. భార‌తీయ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం కానీ.. విదేశాల‌కు చెందిన మ‌ద్యాన్ని అయినా ఇంటికి డెలివ‌రీ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు, సంస్థ‌ల‌కు మాత్రం మ‌ద్యం హోండెలివ‌రీ ఉండ‌ద‌న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com