నేటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో వేసవి పని గంటలు అమల్లోకి

- June 01, 2021 , by Maagulf
నేటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో వేసవి పని గంటలు అమల్లోకి

దోహా: మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్, నేటి నుంచి వేసవి పని గంటలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ సమ్మర్ వర్కింగ్ అవర్స్ అమల్లో వుంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యామ్నం 3.30 నిమిషాల వరకు వర్క్ బ్యాన్ అమల్లో వుంటుంది బహిరంగ ప్రదేశాల్లో. మే 21న క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వేడి వాతావరణంలో నుంచి కార్మికులకు ఉపశమనం కలిగిస్తుంది ఈ నిర్ణయం. ప్రతి యజమానీ ఈ నిబంధనని తప్పక పాటించాల్సి వుంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com