విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ నిబంధనల్ని ఎత్తివేయనున్న అబుదాబీ?
- June 01, 2021
అబుదాబీ: టూరిజం రంగానికి ఊతమిచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది అబుదాబీ. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు జులై 1 నుంచి క్వారంటైన్ నిబంధనల్లేకుండా చేయనున్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పది రోజుల క్వారంటైన్ విధిస్తున్నారు. గ్రీన్ లిస్టు దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేవారికి ఇది వర్తింపజేస్తున్నారు. పాండమిక్ నేపథ్యంలో ఈ క్వారంటైన్ హోటళ్ళ రంగానికి కొంత ఊతమిస్తోంది. ఎక్కువగా డొమెస్టిక్ టూరిజంపై ఫోకస్ వున్నా, దాన్ని మరింత ఎక్కువగా పెంచేందుకోసం ట్రావెల్ నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నారు. ఈ నిర్ణయాలు ఎయిర్ లైన్స్ సంస్థలకు కొత్త ఉత్సాహాన్నివ్వనున్నాయి. విమాన సర్వీసుల పెంపుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం వుంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







