అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: టి.డీజీపీ
- June 01, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కూకట్‌పల్లి జెఎన్‌టీయూ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని.. దానిలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ తమకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దని డీజీపీ సూచించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు.. జనసాంద్రత కలిగిన కమిషనరేట్స్, హైదరాబాద్ పరిధిలల్లో కఠినంగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారని డీజీపీ వెల్లడించారు. మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పటిష్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సడలింపు సమయం అనంతరం లాక్‌డౌన్‌లో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







