హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు

- June 02, 2021 , by Maagulf
హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు

కోల్కతా: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 15 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్‌ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎల‌క్ట్రిష‌న్ గ్రేడ్‌-2, ఎల‌క్ట్రిష‌న్ క‌మ్ లైబ్రేరియ‌న్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన‌వారు కోల్‌క‌తాలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 21
ఇందులో ఎల‌క్ట్రిష‌న్ 20, ఎల‌క్ట్రిష‌న్ క‌మ్ లైబ్రేరియ‌న్ 1 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: ఐఐటీలో ఎలక్ట్రిష‌న్ ట్రేడ్ చేసి ఉండాలి. అనుభ‌వం త‌ప్పనిసరి.

దరఖాస్తు చేసుకునే విధానం: ఆఫ్‌లైన్‌లో నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దానిని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
చిరునామా: Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 15
వెబ్‌సైట్‌: http://https://www.hindustancopper.com/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com