వర్కర్ల కోసం ఎట్టకేలకు భూసరిహద్దులను తెరిచిన ఒమన్

- June 03, 2021 , by Maagulf
వర్కర్ల కోసం ఎట్టకేలకు భూసరిహద్దులను తెరిచిన ఒమన్

 ఒమన్: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో భూసరిహద్దుల ద్వారా ప్రయాణాలకు అనుమతించాలని ఒమన్ నిర్ణయించింది.జీసీసీ దేశాల నుంచి వచ్చే వర్కర్లను 
ల్యాండ్ బోర్డర్ ద్వారా దేశంలోకి అనుమతించనున్నట్లు సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. అయితే...ఒమన్ కు వచ్చే కార్మికులు తాము ఎక్కడ పని చేస్తున్నారో ధృవపత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే...మసీదుల్లో రోజువారీ ప్రార్థనలకు కూడా సుప్రీం కమిటీ ఆమోదం తెలిపింది. అయితే..వంద మందికి మించి అనుమతించొద్దని షరతు విధించింది. మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలపై మాత్రం నిషేధం కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com