మిలటరీ కొలువుల కోసం 8,000 మంది దరఖాస్తు

- June 03, 2021 , by Maagulf
మిలటరీ కొలువుల కోసం 8,000 మంది దరఖాస్తు

ఒమన్: మిలటరీలో ఉద్యోగాల కోసం 8,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఒమన్ ప్రకటించింది. మిలటరీలో 10 వేల ఉద్యోగాల భర్తీకి గతవారమే దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే.అడ్మినిస్ట్రేటీవ్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లతో పాటు మిలటరీ ఫ్రంట్ లైన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను భర్తీ చేయనున్నారు.అయితే..ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పటివరకు 8,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇదిలాఉంటే ఉద్యోగాల కోసం నిరసనలు వ్యక్తం అయిన తర్వాత మొత్తం 32 వేల ఉద్యోగాల భర్తీకి ఒమన్ సుల్తాన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో  మిలటరీ, సివిల్ సర్వీస్ మూడో వంతు ఉద్యోగాలను కల్పించాల్సి ఉండగా మిగిలిన ఉద్యోగాలను పలు ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కల్పించాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com