త్వరలో 'శాకుంతలం' సెకండ్ షెడ్యూల్
- June 03, 2021
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రం తెరకెక్కుతోంది. మే 10వ తేదీ వరకు షూటింగ్ జరిపిన చిత్ర బృంద కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆపేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గం. వరకు వెసులుబాటు లభించడంతో త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. అంతే కాదు షూటింగ్ ఇంత త్వరగా మొదలుపెట్టడానికి ముఖ్య కావడానికి కారణం సమంత - ప్రొడ్యూసర్ నీలిమ అంటున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత గుణశేఖర్ నుండి 'శాకుంతలం' రాబోతోంది. పదేళ్ళ కెరీర్‌లో సమంత మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఇందులో దుష్యంతుడుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో మంచు మోహన్ బాబు, అదితి బాలన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మెలోడిబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







