భారత్ కరోనా అప్డేట్
- June 04, 2021
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.గత రెండు రోజుల్లో కాస్త పెరుగుతూ రాగా.. శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా1,32,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.కొత్తగా మరో 2,07,071 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.మరో వైపు మరణాలు సైతం తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది.ఇందులో2,65,97,655 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 3,40,702 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు.ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది.
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 7.27శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38 శాతానికి పడిపోయిందని, వరుసగా 11 రోజుల్లో పది శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







