అరబ్ యువకుడికి Dh25,000 ఫైన్..కార్ డ్యామేజ్ కేసులో తీర్పు

- June 04, 2021 , by Maagulf
అరబ్ యువకుడికి Dh25,000 ఫైన్..కార్ డ్యామేజ్ కేసులో తీర్పు

యూఏఈ:కారు డ్రైవర్ ను కించపరిచేలా దుర్భషలాడుతూ, అతని కారును డ్యామేజ్ చేసినందుకుగాను ఓ అరబ్ వ్యక్తికి Dh25,000 ఫైన్ విధించింది కోర్టు.అల్ ఐన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం రోడ్డుపై లేన్ మార్చే క్రమంలో నిందితుడు, బాధితుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన వాహనాన్ని చేస్ చేసి అడ్డుకోవటంతో పాటు నిందితుడు తన వాహనాన్ని డ్యామేజ్ చేశాడని, తనను బెదిరించటమే కాకుండా తన గౌరవ మర్యాదలకు నష్టం వాటిల్లేలా కించపరిచాడంటూ బాధితుడు కోర్టుకు విన్నవించాడు. తనకు కలిగిన నష్టానికి పరిహారంగా Dh51,000 ఇప్పించాలని కోరాడు. అయితే..వాదనలు విన్న అల్ ఐన్ ప్రాథమిక న్యాయస్థానం డ్రైవర్, వాహన యజమానికి కలిపి నిందితుడు Dh25,000 పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com