భారత్ కరోనా అప్డేట్

- June 04, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.గత రెండు రోజుల్లో కాస్త పెరుగుతూ రాగా.. శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా1,32,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.కొత్తగా మరో 2,07,071 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.మరో వైపు మరణాలు సైతం తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది.ఇందులో2,65,97,655 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 3,40,702 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు.ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పింది.

ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 7.27శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38 శాతానికి పడిపోయిందని, వరుసగా 11 రోజుల్లో పది శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com