విదేశీయుల వీసా గడువు పొడిగింపు

- June 04, 2021 , by Maagulf
విదేశీయుల వీసా గడువు పొడిగింపు

న్యూ ఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టాయి ఆయా ప్ర‌భుత్వాలు.దీంతో లాక్‌డౌన్ కార‌ణంగా కొన్ని ప్ర‌త్యేక విమానాలు త‌ప్పితే.. రెగ్యుల‌ర్ స‌ర్వీసులు న‌డిచే ప‌రిస్థితి లేదు.దీంతో.. భార‌త్‌లో విదేశీయులు చిక్కుకుపోయారు.. వారిలో కొంద‌రి వీసాల గ‌డువు కూడా ముగిసిపోయింది.దీంతో.. కేంద్ర హోంశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.విదేశీయుల వీసాల చెల్లుబాటు గ‌డువును ఆగస్టు 31వ తేదీ వ‌ర‌కు పొడిగించింది.ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.దీంతో.. విదేశీయులు వీసాల గడువు పొడిగింపు కోసం మ‌ళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసింది.వీసాల గడువు దాటినా..ఎలాంటి జరిమానాలు లేకుండా ఆగస్టు 31వ తేదీ వ‌ర‌కు చెల్లుబాటు కానున్న‌ట్టు పేర్కొంది.కాగా, లాక్‌డౌన్ కార‌ణంగా భార‌తీయులు సైతం విదేశాల్లో చిక్కుకుపోయారు.వారిని స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను న‌డుపుతోన్న సంగ‌తి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com