ఆ క్యాటగిరీ వారికి విమానం టికెట్లపై డిస్కౌంట్
- June 04, 2021
న్యూ ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. అన్ని దేశీ విమానాలపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొంత మందికే వర్తిస్తుంది. సర్టిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
కోవిడ్ 19తో పోరాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు విమాన టికెట్ల బేస్ ఫేర్‌లో 30 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రొఫెషనల్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఈ వివరాలు అందిస్తే సరిపోతుంది.
అలాగే చెకిన్, బోర్డింగ్ సమయంలో కూడా ఇదే ఐడీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎయిర్‌పోర్ట్ యూసేజ్ చార్జీలు, ట్యాక్సులు వంటివి మాత్రం చెల్లించాలి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. విమాన ప్రయాణం చేసే హెల్త్ కేర్ వర్కర్లకు ఈ ఆఫర్ వల్ల బెనిఫిట్ ఉంటుంది.
ప్రయాణికులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వంటి ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ఐడీ కార్డు ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఈ డాక్యుమెంట్లు లేకపోతే అప్పుడు సాధారణ చార్జీలే వర్తిస్తాయి. కేవలం హెల్త్ కేర్ వర్కర్లకే ఈ ఫెసిలిటీ ఉంటుందని గమనించాలి. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆఫర్ వర్తించదు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం