కోవిడ్ పేషెంట్లలో 93% వ్యాక్సిన్ తీసుకోని వారే!
- June 06, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోని వారిపైనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు కువైట్ గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం వ్యాక్సిన్ తీసుకోనివారే కావటం గమానార్హం. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారిన పడుతున్నా..వారు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం కువైట్ ఆస్పత్రులు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 93% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే..వ్యాక్సిన్ ద్వారా 100 శాతం కోవిడ్ ను నియంత్రించే అవకాశాలు లేకున్నా..వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







