దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం...మాటను వెనక్కు తీసుకున్న ఆసుపత్రి
- June 06, 2021
మలయాళ భాషకు సంబంధించి దిల్లీ జిప్మెర్ జారీ చేసిన ఆదేశాలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. నర్సులు.. పని ప్రదేశంలో మలయాళం మాట్లాడకూడదని.. హిందీ లేదా ఇంగ్లీష్‌నే వాడాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన కారణంగా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది ఆసుపత్రి.

ఇది భాష వివక్షత అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖులు.
జిప్మెర్ ఏమంది?
"ఎక్కువ మంది రోగులు, సిబ్బందికి మలయాళం రాదు. దీంతో వారు నిస్సహాయులుగా భావించడం మూలంగా చాలా అసౌకర్యం కలుగుతోంది" అని జిప్మెర్ వివరించింది. మలయాళ భాషపై ఓ రోగి చేసిన ఫిర్యాదు మేరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపింది.కానీ ఉత్తర్వులపై తీవ్ర వ్యక్తిరేకత ఎదురైన కారణంగా వాటిని ఉపసంహరించుకుంది. అప్పటికే ఈ వ్యవహారంపై రాజకీయంగా చర్చనీయాశమైంది.
జిప్మెర్ ఆదేశాలపై నర్సింగ్ సంఘాలు, రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ప్రముఖుల స్పందన:
ఆసుపత్రి చర్యను దుయ్యబట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. "దేశంలోని ఇతర భాషల్లాగే మలయాళం కూడా భారతీయ భాషే. భాష పరమైన వివక్షను ఆపండి."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అనాగరిక, రాజ్యాంగ విరుద్ధ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణు గోపాల్. "ప్రపంచవ్యాప్తంగా రోగుల క్షేమం కోసం కేరళ నర్సులు పనిచేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందినవారు వారిలో వారు మాతృభాషలో మాట్లాడతారు. భాష తెలియనివారితోనూ మలయాళంలోనే మాట్లాడతారని అనుకోవడంలో అర్థం లేదు. ఈ ఆదేశాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా, వివక్షపూరితం."- కేసీ వేణు గోపాల్, కాంగ్రెస్ ఎంపీ
"భాష అర్థమయ్యే వారితో తమ మాతృభాషలో మాట్లాడవద్దని ప్రజాస్వామ్య భారత్‌లో ఓ ప్రభుత్వ సంస్థ చెప్పడం విడ్డూరం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆదేశాలు భారత పౌరుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలి," అని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు.
"ఈ ఆదేశం భాషా జాతివాదాన్ని సూచిస్తుంది. భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి. అందులో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలి. ఆ ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించకూడదు" అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







