నార్తరన్ షేక్ జాయెద్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ లైట్ ఏర్పాటు

- June 10, 2021 , by Maagulf
నార్తరన్ షేక్ జాయెద్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ లైట్ ఏర్పాటు

బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, కొత్త ట్రాఫిక్ లైటుని నార్తరన్ షేక్ జాయెద్ రోడ్డుపై ఏర్పాటు చేసింది. స్ట్రీట్ 8 కూడలి వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలి మరియు సల్మాబాద్ అలాగే మదీనాత్ జాయెద్ నుంచి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్ వైపు మనామా తదితర ప్రాంతాలకు వెళ్ళేవారికి ఇది ఉపయోగకరంగా వుంటుంది. ఇసా టౌన్ ప్రాంతంలోని ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి కూడా వీలుగా వుంటుంది ఈ ప్రాజెక్ట్. ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. మొత్తం 23,400,000 బహ్రెయినీ దినార్లతో ఈ మొత్తం ప్రాజెక్టుని రూపొందించారు.ఆగస్టు 2019లో మొదటి ఫేస్ పనులు ప్రారంభమయ్యాయి.మొదటి పార్ట్ డిసెంబర్ 16న ఓపెన్ చేశారు.రెండో ఫేజ్ ఫిబ్రవరిలో ఓపెన్ అయ్యింది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com