జెడ్డాలో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం

జెడ్డాలో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం

సౌదీ: వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేసేందుకు సౌదీ ప్రభుత్వం కొత్తగా మరో వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించింది. జెడ్డాలోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్-ఫైసల్ స్టేడియంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ సెంటర్ ను సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తవ్ఫిక్ అల్-రబియా ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారని, వ్యాక్సిన్ కోసం సెహతీ యాప్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో కొత్త సెంటర్ ను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. జెడ్డా వ్యాక్సినేషన్ సెంటర్ ను స్పెషలిస్ట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 15,000 మందికి వ్యాక్సిన్ అందించేలా  ఇందులో 60 క్లినిక్‌లు ఉన్నాయి. ఇదిలాఉంటే..తన పర్యటనలో భాగంగా అల్-రబియా తూర్పు జెడ్డా జనరల్ హాస్పిటల్‌లోని వర్క్‌ఫ్లోను మంత్రి పరిశీలించారు, అక్కడ ఎమర్జెన్సీ, ఫిజియోథెరపీ వార్డులను, శ్వాసకోశ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రిలోని జనరల్ మెడికల్ అథారిటీ, కోవిడ్ -19 వ్యాక్సిన్ సెంటర్‌లో కూడా మంత్రి పర్యటించారు.

 

Back to Top