కువైట్-భారత్ మధ్య గృహ కార్మికుల భర్తీపై ఒప్పందం

కువైట్-భారత్ మధ్య గృహ కార్మికుల భర్తీపై ఒప్పందం

కువైట్ సిటీ: కువైట్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడి 60 ఏళ్లైన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కువైట్లో సమావేశం అయ్యారు. కువైట్ కొత్త పాలకుడికి ప్రధాని మోదీ రాసిన సందేశ లేఖతో గల్ఫ్ కంట్రీకి చేరుకున్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ అల్-నాజర్ అల్-సబా పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు దేశాల మైత్రి బంధం మరింత దృఢంగా మారుతోందని షేక్ అహ్మద్ కొనియాడారు. ఈ ఇద్దరు విదేశాంగ మంత్రుల ఆధ్వర్యంలో ఆరోగ్య, అహార భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలసిన ఆవశ్యతపై డిస్కస్ చేశారు. భారత్ నుంచి కువైట్ కు వెళ్లే గృహ కార్మికుల భద్రతకు సంబంధించి రెండు దేశాల మధ్య డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభంలో భారత్ కు కువైట్ అందించిన సాయాన్ని ఆయన ప్రశంసించారు. 

 

Back to Top