కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన హోటల్ సీజ్

కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన హోటల్ సీజ్

ఒమన్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించటంతో ఓ హోటల్ ను సీజ్ చేసినట్లు హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి అధికారులు వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించేలా పర్యవేక్షించేందుకు, అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించేలా తనిఖీలు నిర్వహించేందుకు ఏర్పాటైన అధికారుల బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ బృందంలో హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి, ఆరోగ్య, కార్మిక మంత్రిత్వ శాఖల అధికారులు ఉన్నారు. ఈ బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించారు. ఓ హోటల్ ను పూర్తిగా సీజ్ చేశారు. 

 

Back to Top