Wusool ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకున్న 20,000 మంది మహిళా ఉద్యోగులు
- June 11, 2021సౌదీ: ప్రవైట్ రంగంలోని 20 వేల మంది సౌదీ మహిళా ఉద్యోగులు 7 నెలల కాలంలో Wusool ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది నవంబర్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభించగా ఈ ఏడాది మే వరకు 20,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే సౌదీ మహిళలకు ప్రయాణ భారం తగ్గించటంతో పాటు సురక్షిత ప్రయాణ వసతులను కల్పించేందుకు Wusool ప్రోగ్రాంను ప్రారంభించిన విషయం తెలిసిందే. మానవ వనరుల అభివృద్ధి నిధికి అనుబంధంగా ఈ ప్రోగ్రాంను చేపట్టారు.Wusool ద్వారా ఎక్కువ మంది మహిళలకు లబ్ధి చేకూరేలా రిజిస్ట్రేషన్ విధానాన్ని సులభతరం చేయటం వల్లే ఎక్కువ మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు HRD అధికారులు తెలిపారు. అలాగే ప్రయాణ మద్దతు గడువును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సౌదీలో 13 ప్రాంతాల్లో Wusool ద్వారా ప్రైవేట్ రంగంలోని మహిళకు రవాణా సౌకర్యం అందిస్తున్నారు. కొత్తగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్న మహిళా ఉద్యోగులు http://http://wusool.sa. ద్వారా పేర్లను నమోదు చేసుకొని లబ్ధి పొందవచ్చన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల